ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.. సాదాబైనాలకు పరిష్కారం చూపాం: మంత్రి పొంగులేటి

ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.. సాదాబైనాలకు పరిష్కారం చూపాం: మంత్రి పొంగులేటి

రైతుల కళ్లలో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికుట్రలు చేసినా  రైతు సంక్షేమం ఆపమన్నారు. రైతులకు అనేక సమస్యలు సృష్టించిన ధరణిని బంగాళాఖాతంలో కలిపామన్నారు.  సాదాబైనామాలన్నింటికీ పరిష్కారం చూపామన్నారు.  ఆదివారం (మార్చి22)  సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొని  మాట్లాడారు మంత్రి పొంగులేటి. 

అంతకుముందు మూడు వందల కోట్ల రూపాయలతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీనిసీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యాక్టరీని ప్రారంభించి రైతన్నలకు అంకితం చేశారు. అక్కడే రూ.80 కోట్లతో నిర్మించే రిఫైనరీ యూనిట్‎కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు వివేక్ వెంకట స్వామి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 

►ALSO READ | రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్: రైతు భరోసా నిధులు రిలీజ్

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంటకస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అద్భుతమైన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. కొత్త ఉద్యోగాల కల్పనకు ఏటీసీలు ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్కిల్ నేర్పించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామన్నారు. ఏటీసీలో ట్రైనింగ్ తీసుకుని విద్యార్థులకు రూ.2 వేలు ఇస్తున్నామని తెలిపారు. సిద్ధిపేటలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.