
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫరోఖ్ ఇంజనీర్ కు ఇంగ్లాండ్ లో అరుదైన గౌరవం లభించింది. ఇంగ్లాండ్ లోని ఐకానిక్ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఒక స్టాండ్ కు అతని పేరు పెట్టారు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య బుధవారం (జూలై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముందు ఫరోఖ్ ఇంజనీర్ పేరు మీద ఒక స్టాండ్ కు నామకరం చేయడం జరిగింది. ఈ టీమిండియా వికెట్ కీపర్ తో పాటు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ క్లైవ్ లాయిడ్ పేరు మీద ఒక స్టాండ్ కు నామకరం చేయడం జరిగింది.
ఈ ఇద్దరు క్రికెటర్లకు ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ ముందు మ్యాచ్ కు ఆహ్వానం అందింది. మ్యాచ్ కు ముందు నామకరణ వేడుక నిర్వహించి స్టాండ్ కు ఉన్న వీరి పేర్లను వీరు ముందే ఓపెన్ చేయడం జరిగింది. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నప్పటికీ వీరిద్దరికే ఈ గౌరవం దక్కడానికి కారణం లేకపోలేదు. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో భాగంగా ఫరోక్ ఇంజనీర్ లంకాషైర్ తరపున ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో దాదాపు దశాబ్దం పాటు ఆడగా.. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ లాయిడ్ రెండు దశాబ్దాల పాటు ఇదే క్లబ్ తరపున ఆడుతూ చెరగని ముద్ర వేశాడు. క్లబ్ కు చేసిన సేవలకు ఈ ఇద్దరు దిగ్గజాలకు తగిన గౌరవాన్ని ఇచ్చి సత్కరించాయి.
1968 నుంచి 1976 మధ్య ఫరోఖ్ ఇంజనీర్ లంకాషైర్ తరపున ఆడాడు. 175 మ్యాచ్‌ల్లో 87 ఏళ్ల ఇంజనీర్.. లంకాషైర్ తరపున 5942 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ 429 క్యాచ్‌లు తీసుకోవడంతో పాటు 35 స్టంపింగ్‌లు చేశాడు. ముంబైలో జన్మించిన ఫరోఖ్ ఇంజనీర్ లంకాషైర్ అరంగేట్రం చేసినప్పుడు లంకాషైర్ క్లబ్ కు అప్పటివరకు ప్రధాన టైటిల్ లేదు. కానీ ఫరోక్ ఆడినప్పుడు 1970 నుంచి 1975 మధ్య నాలుగు సార్లు జిలెట్ కప్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ లాయిడ్ 1970 నుంచి రెండు దశాబ్దాల పాటు క్లబ్ తరపున ఆడి టాప్ లో నిలబెట్టాడు.
ఫరోక్ ఇంజనీర్ ఓవరాల్ గా టీమిండియా తరపున 46 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 87 ఇన్నింగ్స్ ల్లో 31 యావరేజ్ తో 2611 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలతో పాటు 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 5 వన్డేల్లో 38 యావరేజ్ తో 114 పరుగులు చేశాడు. వీటిలో ఒక హాఫ్ సెంచరీ ఉంది.
🚨Farokh Engineer stand at Old Trafford Stadium, Manchester🚨
— alekhaNikun (@nikun28) July 23, 2025
Former Indian Charismatic WK Farokh Engineer will inaugurate the stand named after him on 23rd July
Before the start of Day-1 #INDvENG match.
Stand for his incredible contribution to Lancashire county.@lancscricket pic.twitter.com/FDdcwAUJbT