జమ్మూ ఎన్నికలు: ఫరూక్ అబ్దుల్లా పార్టీతో కాంగ్రెస్ పొత్తు

జమ్మూ ఎన్నికలు: ఫరూక్ అబ్దుల్లా పార్టీతో కాంగ్రెస్ పొత్తు

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల హీట్ మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావటంతో.. పొత్తులు, ప్రచార వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2024, ఆగస్ట్ 22వ తేదీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు ఖర్గే, రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్ లో పర్యటించారు. వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేతతోనూ మీట్ అయ్యారు.

జమ్మూకాశ్మీర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జమ్మూ , కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) , కాంగ్రెస్‌తో పార్టీకి దోస్తీ కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేయనున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్ధుల్లా తెలిపారు. ప్రస్తుతం సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్నాయి. 

నేషనల్ కాన్ఫరెన్స్ , కాంగ్రెస్ నేతలు శ్రీనగర్‌లో అర్థరాత్రి సమావేశమై పొత్తుల వివరాలను చర్చించారు. ప్రధానంగా రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై దృష్టి పెట్టారు. కాశ్మీర్ లోయలో 12 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ తన కోరికను వ్యక్తం చేసింది. అదే సమయంలో జమ్మూ డివిజన్‌లో ఎన్‌సికి 12 సీట్లను ఆఫర్ చేసింది.

ALSO READ | మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు: కేంద్ర ఎన్నికల సంఘం