వేగంగా ప్రైవేటీకరణ.. 4 పీఎస్​యూల్లో వాటాల అమ్మకం

వేగంగా ప్రైవేటీకరణ.. 4 పీఎస్​యూల్లో వాటాల అమ్మకం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కోల్ ఇండియా , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిల్డర్స్ అండ్​ ఇంజనీర్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్​యూలు) వాటాలను విక్రయించే అవకాశం ఉంది.   ఆఫర్​ ఫర్​ సేల్​ (ఓఎఫ్ఎస్)  ​ విధానం ద్వారా వాటాలను అమ్మడానికి ఏర్పాట్లు చేస్తోంది. 

ఆర్​వీఎన్​ఎల్​లో వాటాల అమ్మకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్​ తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఎల్​ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ నాలుగో క్వార్టర్​లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మజ్​గావ్​ డాక్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిల్డర్స్ లిమిటెడ్​లో కేంద్రం  రూ. 5,000 కోట్ల విలువైన వాటాలను ఓఎఫ్​ఎస్​ ద్వారా అమ్మింది.   పబ్లిక్ కంపెనీల ప్రమోటర్లు తమ షేర్లను ప్రజలకు విక్రయించడానికి ఉపయోగించే పద్ధతిని ఓఎఫ్ఎస్​ అంటారు. 

ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారాల ద్వారా జరుగుతుంది. సాధారణంగా పెద్ద మొత్తంలో షేర్లను విక్రయించడానికి ఇది అనుకూలమైన మార్గమని సీనియర్​ ఎనలిస్టు ఒకరు చెప్పారు.  ఈ సంస్థల్లో ఓఎఫ్ఎస్ ద్వారా వాటాలు విక్రయించడం ద్వారా ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరం లో నిర్దేశించుకున్న రూ.47 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించవచ్చని అన్నారు.