శంషాబాద్ సమీపంలో డీసీఎం బీభత్సం.. ముగ్గురి మృతి

శంషాబాద్ సమీపంలో డీసీఎం బీభత్సం.. ముగ్గురి మృతి

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. షాద్నగర్ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం పెద్దషాపూర్ దగ్గర అదుపు తప్పింది. అది కారును ఢీకొట్టి తర్వాత బైకును ఢీకొట్టి ముగ్గురి పై నుంచి దూసుకెళ్లింది. ఈ  ప్రమాదంలో షాద్ నగర్ నియోజకవర్గం సరూర్ నగర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డీసీఎం బీభత్సంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. పోలీసులు క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.