
కంటోన్మెంట్, వెలుగు: క్రమంగా ఆయుధాలు అమ్ముతున్న తండ్రీకొడుకును బోయిన్ పల్లి, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు డాగర్లు, నాలుగు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం... రాజస్తాన్నుంచి తండ్రీ కొడుకులు వినయ్‌శర్మ కొలారియా (53), ఆకాశ్ కొలారియా (23) సిటీకి వచ్చి న్యూ బోయిన్పల్లి సౌజన్య కాలనీలో నివసిస్తున్నారు. జేసీ క్రాఫ్ట్పేరుతో హ్యాండీ క్రాఫ్ట్షాపు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా బిజినెస్ నడవడం లేదు. దీంతో పెళ్లిళ్ల ఊరేగింపులో కత్తులు, డాగర్లు, సినిమాల్లో వాడే అనుకరణ రైఫిళ్లకు డిమాండ్ ఉందని గ్రహించారు. రాజస్థాన్ లోని ఓ వ్యాపారి నుంచి కత్తులు, డాగర్లు, రైఫిళ్లను హ్యాండీ క్రాఫ్ట్స్పేరుతో హైదరాబాద్‌కు ట్రాన్స్‌పోర్టు ద్వారా తెచ్చి షాపులో భద్రపరిచాడు. వాటిని రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు అమ్ముతున్నారు. సమాచారం అందడంతో పోలీసులు జేసీ క్రాఫ్ట్స్ షాపుపై దాడి చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.