
హైదరాబాద్, వెలుగు: వెల్‌నెస్ ఆధారిత రియల్ ఎస్టేట్ హాస్పిటాలిటీ కంపెనీ రిధిరా గ్రూప్, తమ ఫ్లాగ్‌షిప్ వెల్‌నెస్ ప్రాజెక్ట్ ‘రిధిరా జెన్’ ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ. ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది. ఈ కమ్యూనిటీలోని ఇండ్లను, ఇతర వసతులను 3డీ ప్రింటర్ల సహాయంతో నిర్మిస్తారు. దీంతో వ్యర్థాలు గణనీయంగా తగ్గుతాయి.
స్థానిక వనరులు, రీసైకిల్ చేసిన పదార్థాలు వాడుకోవచ్చు. భారీ యంత్రాలు, కూలీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఫ్లై యాష్, స్లాగ్ వంటి ప్రత్యామ్నాయాల వాడకం వల్ల కార్బన్ ఉద్గారాలు 50 శాతం వరకు తగ్గుతాయి. రిధిరా గ్రూప్ వెల్నెస్ కమ్యూనిటీల్లో యోగా స్టూడియోలు, స్పా, టెక్నో జిమ్, సన్‌డెక్‌లతో కూడిన పూల్స్ వంటి సదుపాయాలు ఉంటాయని రిధిరా గ్రూప్ ఫౌండర్ రితేష్ మస్తిపురం తెలిపారు.