ఆర్టీసీలో అన్ క్లెయిమ్ ఐటమ్స్ ఆక్షన్.. ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహణ

ఆర్టీసీలో అన్ క్లెయిమ్ ఐటమ్స్ ఆక్షన్.. ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహణ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను(అన్​క్లెయిమ్​ఐటమ్స్​) మరోసారి వేలం వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు పలుసార్లు వేలం నిర్వహించగా, చాలామంది వస్తువులను తక్కువ ధరలకే దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెల 16, 17 తేదీల్లో మిగిలిపోయిన వస్తువులను వేలం వేయనున్నట్టు గ్రేటర్​ఆర్టీసీ అసిస్టెంట్​ట్రాఫిక్​మేనేజర్​(లాజిస్టిక్స్​) ఇషాక్​బిన్​మహ్మద్​ తెలిపారు.

ఈసారి వేలంలో 300 రకాల వస్తువులు ఉన్నాయన్నారు. జేబీఎస్​లోని కార్గో కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు వేలం ఉంటుందని, ఎవరైనా నేరుగా వచ్చి పాల్గొనవచ్చన్నారు. ఈసారి 25 ఆటోమొబైల్స్​ఐటమ్స్, 10 ఎలక్ట్రికల్​ఐటమ్స్, 10 క్లాత్​ఐటమ్స్, 25 ఎలక్ట్రానిక్స్​ఐటమ్స్, 10 హౌస్​హోల్డ్​ మెటీరియల్, 15 ​హార్డ్​వేర్​ ఐటమ్స్,10 ఇండస్ట్రియల్​ స్పేర్స్, 195 జనరల్​ ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు.