నిర్మల్ జిల్లా పెంబి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. కోరుకంటి గ్రామంలో విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంట్లోని ఎయిర్ కూలర్‌లో నీళ్లు పోస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కూలర్‌కు కరెంట్ సరఫరా అవుతుండటాన్ని గమనించకపోవడంతో.. నీళ్లు పోస్తున్న సమయంలో తండ్రి శ్రీనివాస్, కొడుకు రాథోడ్ అర్జున్ ఇద్దరూ విద్యుత్ ఘాతానికి గురయ్యారు. క్షణాల వ్యవధిలోనే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు ఇద్దరూ కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో కోరుకంటి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
