కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడని హత్యకు ప్లాన్ వేశాడు ఓ తండ్రి. తాను నీ వల్లే గర్భవతి అయ్యానని ప్రియుడికి ఫోన్ చేయమని కూతురిని బలవంతం పెట్టాడు తండ్రి. ఈ క్రమంలోనే ఫోన్ చేస్తే ఇంటికి వచ్చిన ప్రియుడిపై తండ్రి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు అబ్దుల్ సాహెల్ అనే యువకుడు.
ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. యువతి మైనర్ కావడంతో పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతిని అమ్మా నాన్న చంతకు చేర్చారు. కోన్ని రోజులు జైలు జీవితం అనుభవించిన యువకుడు బెయిల్ పై బయటికి వచ్చాడు సాహెల్. ప్రియుడిపై పగ పెంచుకున్న తండ్రి ఓ మంచి రోజు చూసుకుని కూతరికి ఇలా చెప్పాడు..
" నేను నీ వల్లే తల్లి అయ్యాను మనకు కొడుకు పుట్టాడు వచ్చి చూడు" అని చెప్పామన్నాడు. సేమ్ టూ సేమ్ అలాగే చెప్పిన యువతి మాటలు నమ్మి సాహెల్ ఇంటికి వచ్చాడు. సాహెల్ రాకను చూసి తలుపులు వేసి అతన్ని బంధించారు పేరెంట్స్.. కర్రలతో కొట్టసాగారు. దీంతో భయాబ్రాంతులకు గురైన సదరు యువకుడు ఓ రూంలోకి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాహెల్ ని కాపాడి వారిపై కేసు నమోదు చేశారు.
