
కోహెడ, వెలుగు: తనకు నలుగురు కొడుకులు ఉన్నా ఎవరూ బుక్కెడన్నం పెట్టడం లేదంటూ ఓ వృద్ధుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన తాడూరి దుర్గయ్య(75)కు నలుగురు కుమారులు. తనకున్న ఐదెకరాల భూమిని వారికి పంచేశాడు. ఇప్పుడు తనను ఎవరూ చూసుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడు. కొడుకులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై సుధాకర్ హామీ ఇచ్చారు.