కొడుకు చేతిలో తండ్రి హతం

V6 Velugu Posted on Oct 16, 2021

మెదక్: కుటుంబ తగాదాలతో కన్న తండ్రిని సొంత కొడుకు దారుణంగా హత్య చేశాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధి కోలపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం కోలపల్లి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు రోమాల సాయిలు, రోమాల అనిల్ శుక్రవారం రాత్రి గొడవ పడ్డారు. ఈ క్రమంలో అనిల్ కోపంతో తండ్రి సాయిలుపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. 
కొంతకాలంగా  హైదరాబాదులో ఉంటున్న అనిల్ దసరా పండుగ కోసం సొంత గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ తగాదాలతో తండ్రీ కొడుకులు కొట్లాడుకున్నారు. మాటా మాటా పెరిగి  ఒకరిపై మరొకరు దాడి చేసుకోగా తండ్రి సాయిలు మృతి చెందాడు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జ్, పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్,  క్లూస్ టీం చేరుకొని వివరాలు సేకరించారు.
 

Tagged son, sailu, father, Medak District, quarrel, anil, family disputes, , peddashankarampet mandal, kolapalli village

Latest Videos

Subscribe Now

More News