
మెదక్ టౌన్, వెలుగు : పనులు సక్కగా చేసుకోవాలని తండ్రి మందలించడంతో మండలంలోని జానకంపల్లిలో ఓ యువకుడు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మెదక్ రూరల్ఎస్సై మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... జానకంపల్లికి చెందిన దివిటి షాదుల్ (22) ను తండ్రి భూమయ్య గురువారం మందలించాడు. దీంతో అదే రోజు ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లాడు. స్నేహితుడు కిరణ్‌కు ఫోన్ చేసి పురుగుల మందు తాగానని చెప్పాడు.
వెంటనే కిరణ్ షాదుల్ దగ్గరకు చేరుకొని, అతన్ని బైక్‌పై స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు హాస్పిటల్‌కు వెళ్లి, అక్కడ నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్సకు డబ్బులు సరిపోని పరిస్థతి ఉండటంతో తిరిగి మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు.