Shatrughan Sinha: నా కూతురి పెళ్లి విషయం నాకే తెలియదు.. సోనాక్షి తండ్రి షాకింగ్ కామెంట్స్

Shatrughan Sinha: నా కూతురి పెళ్లి విషయం నాకే తెలియదు.. సోనాక్షి తండ్రి షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పెళ్లి విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె కొంత కాలంగా నటుడు జహీర్ ఇక్బాల్‌తో రిలేషన్ లో ఉందని, త్వరలోనే ఈ జంట పెళ్లిచేసుకోబోతున్నారనే వార్తలు బె టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై సోనాక్షి సిన్హా తండ్రి నటుడు శతృఘ్నసిన్హా (Shatrughan Sinha) స్పందించారు. తన కూతురు పెళ్లి విషయం తనకే తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ..  నా కూతురు సోనాక్షి పెళ్లి చేసుకోనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, నాకు మాత్రం ఆ పెళ్లి గురించి ఎలాంటి సమాచారం లేదు. సోనాక్షి ఇప్పటివరకు తన పెళ్లిలా గురించి నా దగ్గర ప్రస్తావించలేదు. ఒకవేళ నా కూతురి వివాహం నిజంగా జరిగితే.. బారాత్‌ ముందు డాన్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయినా.. ఈ రోజుల్లో పిల్లలు తమ పర్సనల్ విషయాల్లో తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవడంలేదు.. జస్ట్ అందరికి చెప్పినట్టుగానే వారికి చెప్తున్నారు అంతే. సోనాక్షి నిర్ణయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటూ చెప్పుకొచ్చారు శతృఘ్నసిన్హా. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.