ఈ ఫొటోలో ఉన్న వాడిని చూడండీ.. వీడిని ఓసారి మళ్లీ మళ్లీ జాగ్రత్తగా చూడండీ.. చూశారు కదా.. వీడు చేసిన పని తెలిస్తే.. ఇలాంటి నాన్న ఉంటాడా.. వీడు మనిషేనా అంటారు.. అంతేనా వీడు తండ్రినా.. రాక్షసుడు.. పశువునా అంటారు.. మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లు.. వాళ్ల వయస్సు పదేళ్లు.. 11 ఏళ్లు.. ఇద్దరిని ఇంట్లోనే.. ఓ కమ్మీకి తలకిందులుగా వేలాడదీసి.. రాత్రంతా కొట్టాడు.. మంచినీళ్లు కావాలని అడిగినా ఇవ్వలేదు.. ఉదయం చూసేసరికి ఓ కూతురు చనిపోయింది.. మరో కూతురు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.. ఆస్పత్రిలో రెండో కూతురు చెప్పిన విషయాలు విని డాక్టర్లే షాక్ అయ్యారు.. పోలీసులు నోరెళ్లబెట్టారు.. వీడు అసలు మనిషేనా.. తండ్రేనా.. రాక్షసుడా లేక పశువునా అని డాక్టర్ల నోట మాటలు రావటం.. ఈ ఘటన తీవ్రతను.. ఈ తండ్రి చిత్ర హింసలు చర్చనీయాంశం అయ్యాయి.
కన్నకూతురు అని కూడా చూడకుండా, చిన్న దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ తండ్రి రాక్షసుడిలా మారాడు. పది ఏళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా ఒక రాత్రంతా తలకిందులుగా ఇంట్లో వేలాడదీసి, ఆమె ప్రాణాలు విడిచే వరకు కనికరం లేకుండా ప్రవర్తించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కలకలం రేపింది. ఆకలివేస్తే అమ్మ అని, ఆపద వస్తే నాన్న అని అరిచే ఆ పసి ప్రాణం.. తన తండ్రి చేతుల్లోనే చిత్రహింసలకు గురై మరణించటం అందరినీ కలచివేస్తోంది.
సాంగ్లీ జిల్లా ఆట్పాడి తాలూకాకు చెందిన దాదూ అలియాస్ నానా యమ్గర్ అనే రైతుకు ఇద్దరు కుమార్తెలు రుతుజ(10), అనుజ(11). బంధువుల ఇంట్లో ఈ పిల్లలు డబ్బులు దొంగిలించారని అనుమానించిన ఆ తండ్రి.. కనీసం వారు చెప్పేది వినే ప్రయత్నం కూడా చేయలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. పశువుల కంటే హీనంగా ఇద్దరు కుమార్తెల కాళ్లు, చేతులు కట్టేసి ఇంటి కప్పుకు ఉన్న ఇనుప యాంగిల్‌కు తలకిందులుగా వేలాడదీశాడు. ఆ పసి పిల్లలు భయంతో వణికిపోతూ.. నొప్పితో విలవిలలాడుతూ రాత్రంతా అలాగే ఉండిపోయారు.
అయితే ఆ రాక్షస తండ్రి క్రూరత్వం అక్కడితో ఆగలేదు. చిన్నారుల తాత, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. కొడవలి చూపించి వారిని బెదిరించాడు. చంపేస్తానని హెచ్చరించడంతో ఎవరూ ముందుకు రాలేకపోయారు. చలి పుట్టే రాత్రి వేళ, ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారులు కనీసం గుక్కెడు మంచినీళ్లు ఇవ్వమని ప్రాధేయపడినా ఆ తండ్రి మనసు కరగలేదు. తాగడానికి నీరు కూడా ఇవ్వకుండా వారిని రాత్రంతా నరకయాతనకు గురిచేశాడు.
తెల్లారేసరికి ఆ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు వారిని వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి రుతుజ పరిస్థితి విషమించింది. పండర్పూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ చిన్నారి కన్నుమూసింది. ఆమె అక్క అనుజ ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. పసి ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ కసాయి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. కన్నతండ్రే కాలయముడై కబళించిన ఈ ఘటన సమాజంలో మనుషుల మధ్య మృగాల్లాగా ప్రవర్తిస్తున్న ఇలాంటి వారు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
