మీడియా, ఏవియేషన్, ఇన్సూరెన్స్ లలో విదేశీ కంపెనీలు 

మీడియా, ఏవియేషన్, ఇన్సూరెన్స్ లలో విదేశీ కంపెనీలు 
  • నిబంధనలు మరింత ఈజీ
  • పలు రంగాల్లోకి మరిన్ని ఎఫ్ డీఐలు
  • ఆర్థికమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ: మీడియా, ఏవియేషన్ , ఇన్సూరెన్స్ , సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లోకి ఇంకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐలు) వచ్చేలా నిబంధనలను మరింత సరళతరంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . 2018–19 ఆర్థిక సంవ్సరంలోఎఫ్ డీఐలు ఆరు శాతం పెరిగి రూ.64.37 బిలియన్ డాలర్లకు చేరాయని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఏవియేషన్ , మీడియాతోపాటు ఏనిమేషన్, విజువల్ ఎఫెక్స్ట్ , గేమింగ్,కామిక్స్ (ఏవీజీసీ)రంగాల్లోకి మరిన్ని ఎఫ్ డీఐలు వచ్చేలా చేయడానికి సంబంధిత నిపుణులతో చర్చిస్తామని వెల్లడించారు . బీమా మధ్యవర్తిత్వ సంస్థలకు 100 శాతం ఎఫ్ డీఐలకు అనుమతిస్తామని, సింగిల్ బ్రాండ్ రిటైల్ సెక్టర్ ఎఫ్ డీఐలను పెంచుకోవడానికి లోకల్ సోర్సింగ్ నిబంధనలను సులువుగా మారుస్తామని ఆమె ప్రకటించారు.

ప్రస్తుతం 49 శాతం వరకే అనుమతి

ప్రస్తుత ఎఫ్ డీఐ విధానం ప్రకారం ఇన్సూరెన్స్  బ్రోకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, సర్వే యర్లు, లాస్ అసెసింగ్ కంపెనీల విదేశీ పెట్టుబడులు 49 శాతం మించకూడదు. బీమా మధ్య వర్తిత్వ సంస్థలను సాధారణ ఆర్ధిక సేవల మధ్యవర్తిత్వ సంస్థలుగానే చూడాలని, 100 శాతం ఎఫ్ డీఐలకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వా నికి విజ్ఞప్తులు అందాయి. ప్రపంచవ్యాప్తంగా బీమా వ్యాప్తి 6.2శాతం కాగా, మనదేశంలో 2015 లెక్కల ప్రకారం ఇది 3.4 శాతం. ఇక మీడియా సంస్థల్లో విదేశీ పెట్టుబడులు 26 శాతం మించకూడదు.

ఎఫ్ పీఐ రూల్స్ కూడా…

ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ పీఐ) నిబంధనలను కూడా సరళీకరిస్తున్నట్లు బడ్జెట్లో నిర్మల ప్రకటించారు. ఎఫ్ పీఐలకు కేవైసీ నిబంధనలను సులభం చేయనున్నట్లు తెలిపారు. సమాజంలో సంక్షేమం కోసం ప్రయత్నించే సోషల్ ఎంటర్ ప్రైజస్ లిస్టింగ్ కు వీలు కల్పించనున్నట్లు వెల్లడించారు . పబ్లిక్ ఇష్యూలో కనీస పరిమితిని 35 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు . కార్పొరేట్ బాండ్ మార్కె ట్ విస్తరణకు సెబీ, ఆర్ బీఐలో చర్చించి పలు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.