అధికార పార్టీ నేతలు చంపేస్తారనే భయంతో..

అధికార పార్టీ నేతలు చంపేస్తారనే భయంతో..
  • ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే..

అధికార TRS నేతల ఆగడాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రాజుల తండాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ జగదీష్ తో పాటు మరో 15 మంది రియల్టర్లు గ్రామస్తులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో వారి భయానికి గ్రామం వదిలి పొలాల్లోనే ఉంటున్నారు ఆరు కుటుంబాలకు చెందిన 25 మంది. రెండెకరాల వ్యవసాయ భూమిని తమకు అప్పగించాలని బెదిరిస్తున్నారని తెలిపారు గ్రామస్తులు. ఇంటికి వెళ్లి చంపేస్తామని కొద్ది రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
తాము 16 ఏళ్లుగా వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు గ్రామస్తులు. భూమి ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడటంతో పొలాల్లోనే డేరాలు వేసుకొని ఉంటున్నామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ మ్యాటర్ అంటూ సబ్ ఇన్స్ పెక్టర్ దాటవేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యే దిక్కని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

ఇవి కూడా చదవండి

కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాల కోసం సర్పంచ్ భిక్షాటన

వైరల్ గా మారిన ఎలాన్‌ మస్క్‌ ట్వీట్ 

ట్రాక్టర్లలో ధాన్యంతో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన