కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాల కోసం సర్పంచ్ భిక్షాటన

కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాల కోసం సర్పంచ్ భిక్షాటన
  • ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలేదని భిక్షాటన

నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మిరియాల వెంకన్న వినూత్న నిరసన తెలిపారు. గ్రామంలో అర్ధనగ్నంగా ఇళ్లిళ్లూ తిరుగుతూ  భిక్షాటన చేశారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుల చేయటం లేదంటూ నిరసన తెలిపారు. కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉందని, ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నాడు సర్పంచ్ మిరియాల వెంకన్న.  దీంతో చేసేదేమీ లేక పంచాయతీ కార్మికులతో కలిసి డప్పు చప్పుళ్లతో  ఊళ్లోని షాపుల దగ్గర తిరుగుతూ భిక్షాటన చేస్తున్నామన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు వెంకన్న.

 

ఇవి కూడా చదవండి

వైరల్ గా మారిన ఎలాన్‌ మస్క్‌ ట్వీట్

ట్రాక్టర్లలో ధాన్యంతో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం