స్టాక్ మార్కెట్ ను దెబ్బ తీసిన కొత్త వేరియంట్

స్టాక్ మార్కెట్ ను దెబ్బ తీసిన కొత్త వేరియంట్

మరోసారి కరోనా టెన్షన్ వెంటాడుతోంది. కొత్త వేరియంట్ వ్యాప్తితో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించడంతో మరోసారి ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పై కూడా చూపిస్తోంది. మళ్లీ కరోనా వ్యాపిస్తోందన్న వార్తలు భారత్ స్టాక్ మార్కెట్లను  దెబ్బతీశాయి. బాంబే స్టాక్ మార్కెట్ BSE, నిప్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 14 వందల పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అయ్యింది. కరోనా భయాలకు తోడు ఆసియా మార్కెట్ల పతనం, పడిపోతున్న చమురు నిల్వల వంటి కారణాలు స్టాక్ మార్కెట్ల పతనానికి  కారణమంటున్నారు ఎక్స్ పర్ట్స్.

రిలయన్స్, హెచ్డీఎఫ్సీ,ఐసీఐసీఐ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు సైతం నష్టాల బాటలోనే ఉన్నాయి. ఆసియా సూచీలు రెండు నెలల కనిష్టానికి దిగజారాయి. దీంతో చాలామంది మదుపర్లు సురక్షితమైన బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్క హెల్త్ కేర్ మనిహా దాదాపు అన్ని రంగాల  సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. స్థిరాస్తి, లోహ, ఆటో ఇన్ ఫ్రా,, ఆయిల్ అండ్ గ్యాస్ పీఎస్ యూ బ్యాంకింగ్ షేర్లు కూబి నష్టాల్ని చవిచూస్తున్నాయి.