ఈ ఏడాది 12 ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్​లు​

ఈ ఏడాది 12 ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్​లు​

హైదరాబాద్, వెలుగు:  ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్‌ హైదరాబాద్‌‌‌‌లో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ 10–12 శాఖలను తెరుస్తామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నెట్​వర్క్​ను ఇంకా బలోపేతం చేస్తామని బ్యాంకు ఎండీ, సీఈఓ శ్యామ్​శ్రీనివాసన్​వెల్లడించారు. ఫెడరల్ బ్యాంక్ తెలంగాణలోని 37 శాఖలకు తన నెట్‌‌‌‌వర్కును విస్తరించిందని  ఆయన పేర్కొన్నారు.  

పెరుగుతున్న కస్టమర్ల అవ‌‌‌‌స‌‌‌‌రాల‌‌‌‌ను తీర్చడానికి  ప్రత్యేకంగా లార్జ్ ఏజెన్సీ రిలేషన్‌‌‌‌షిప్ డివిజన్ (ఎల్‌‌‌‌సీఆర్‌‌‌‌డీ),  కార్పొరేట్​సాలరీని టీమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపింది.  హైదరాబాద్​లో దాదాపు రూ.10,500 కోట్ల లోన్‌‌‌‌బుక్‌‌‌‌తో ఫెడరల్ బ్యాంక్ ప్రధానంగా రిటైల్ బ్యాంకింగ్ పై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాల్లో కూడా తాము చురుగ్గా ఉన్నామని తెలిపింది. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పూర్తి స్థాయి జోన్‌‌‌‌గా మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్యామ్​ వెల్లడించారు.