ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.
ఫీజు బకాయిలు చెల్లించిన తర్వాతే ఇతర పథకాలకు నిధులు విడుదల చేయాలన్నారు. విద్యార్థులపై కాలేజీలు ఒత్తిడి చేస్తున్న సమయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేసి, బీసీ గురుకుల పాఠశాలల్లో 20 శాతం సీట్లు పెంచాలని కోరారు.
