బషీర్‌బాగ్,వెలుగు: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లక్డికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌ను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముట్టడించింది. రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ ముకుంద్ కు వినతిపత్రం అందజేశారు
