ఆయనతో పనిచేయడాన్ని చాలా గొప్పగా ఫీలవుతున్నా : కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ మాధవరావు

ఆయనతో పనిచేయడాన్ని చాలా గొప్పగా ఫీలవుతున్నా : కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ మాధవరావు

కృష్ణ గారు మన మధ్య లేరు అంటే ఏదో పోగొట్టుకున్నానన్న ఫీలింగ్ లో ఉన్నానని సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ మాధవరావు అన్నారు. ఆయనతో బాస్, ఆర్టిస్ట్ లా కాకుండా అన్నదమ్ముల బంధంలా ఉండేదని చెప్పారు. ఆయన చాలా గొప్ప మనిషన్న మాధవరావు..  ఏ ఆర్టిస్ట్ కు దక్కని గౌరవం తనకు దక్కిందని, ఆయనతో పనిచేయడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నానని గర్వంగా చెప్పుకున్నారు. 1965 నుండి ఆయనతో ట్రావెల్ అవుతున్నానన్నారు. సినిమాలోకి రాకముందు నాటకాల వేసే టైం నుండి ఆయనతో మంచి స్నేహాభావం ఉండేదని చెప్పారు.  కృష్ణ వేసిన పాత్రలలో తనకు అత్యంత ఇష్టమైన గెటప్ అల్లూరి సీతారామరాజు, మెసగాళ్లకు మోసగాడు అని స్పష్టం చేశారు. - మేకప్, గెటప్ విషయంలో తాను వేసిన తరవాత ఎవరు ఎం చెప్పినా పట్టించుకునేవరు కాదని చెప్పారు.  ఏ హీరో వేయని గెటప్ లు ఆయన వేశారన్న ఆయన.. కృష్ణ గారితో 300 సినిమాలకు పైగా పని చేశానని తెలిపారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది. వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన తార నింగికెగిసింది. సినీ పరిశ్రమలో అనేక ప్రయోగాలకు ఆద్యుడు, దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకొని వేలాది మంది అభిమానులు చివరి చూపు కోసం తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, కళాభిమానులు కృష్ణకు నివాళులు అర్పించారు. ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను, అందించిన ప్రోత్సాహాన్ని, వ్యక్తిగత సహాయాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ మృతికి సంతాపంగా బుధవారం తెలుగు సినీ పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు, అన్ని షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిలిపివేస్తున్నట్లు సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ ప్రకటించారు.