
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల ఖరారు గైడ్లైన్స్ రూపొందించేందుకు సర్కారు నియమించిన కమిటీ మంగళవారం జేఎన్టీయూలో సమావేశం కానున్నది. కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరగనున్నది. ఇతర రాష్ర్టాల్లో ఫీజుల పెంపు ఎలా చేస్తున్నారు. కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి.
ప్రస్తుతం ఎలా ఫీజులు పెంచారనే దానిపై సమీక్షించనున్నారు. కాగా, ఆరు వారాల్లో ఫీజుల పెంపుపై గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు. సమాశానికి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, ఎస్ సీడీడీ కమిషనర్ క్షితిజ, డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అటెండ్ కానున్నారు.