నీట్ పరీక్షలో విద్యార్థినులకు తీవ్ర అవమానం

నీట్ పరీక్షలో విద్యార్థినులకు తీవ్ర అవమానం

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జులై 17న నీట్ పరీక్ష జరిగింది. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో చెకింగ్ ల పేరుతో అవమాన కర ఘటనలు చోటుచేసుకున్నాయి. నీట్ పరీక్షల్లో డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగా విద్యా్ర్థినుల లో దుస్తులు విప్పించినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళితే కేరళలోని కొల్లాం మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో డ్రెస్ కోడ్ పేరుతో విద్యార్థులకు తీవ్ర అవమానం చేసినట్టు సమాచారం. మామూలుగా మెటల్ వస్తువులు నీట్ పరీక్షకు అనుమతించరు. అయితే ఓ పరీక్షా కేంద్రంలో దాదాపు 100మంది విద్యార్థినులను లోదుస్తులు తీసేసి పరీక్ష హాల్లోకి వెళ్లాలని అక్కడి సిబ్బంది ఆదేశించారు. ఇక చేసేదేం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయిలు ఆ నిబంధనను పాటించాల్సి వచ్చింది. ఎగ్జామ్ అనంతరం విద్యార్థినుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో తామంతా మానసిక వేదనకు గురయ్యామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఆరోపణలను మార్థోమా కాలేజీ ఖండించింది. తమ కళాశాలలో కేవలం పరీక్ష నిర్వహించేందుకు మాత్రమే అనుమతులిచ్చామని, తనిఖీలు, బయోమెట్రిక్ వంటివి వేరే వ్యక్తులు చూసుకున్నారని తెలిపింది.