బస్సును ఓవర్ టేక్ చేయబోయి జిమ్ ట్రైనర్ మృతి

బస్సును ఓవర్ టేక్ చేయబోయి  జిమ్ ట్రైనర్ మృతి
  • సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ప్రమాదం

రామచంద్రాపురం, వెలుగు: ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్​ చేయబోయి ప్రమాదవశాత్తు టైర్ల కింద పడి మహిళా జిమ్​ ట్రైనర్​చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.  రామచంద్రాపురం ఎస్ఐ రామకృష్ణ తెలిపిన  ప్రకారం.. బాంబే కాలనీకి చెందిన గంటా సావిత్రి కుమార్తె ఉమామహేశ్వరి(28) స్థానిక జిమ్​లో  ట్రైనర్ గా చేస్తుంది. ఆదివారం ఉదయం డ్యూటీకి స్కూటీపై వెళ్తూ.. కాలనీలోని రోడ్డులో ముందు వెళ్లే ఏలూరు డిపో ఆర్టీసీ బస్సును ఓవర్​టేక్​ చేయబోయి ప్రమాదవశాత్తు వెనక టైర్ల కింద పడింది.  

తలకు, భుజాలకు తీవ్ర గాయాలై ఉమామహేశ్వరి స్పాట్ లో చనిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పటాన్​చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఆర్సీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.