చెక్ పాయింట్ దగ్గర డ్యూటీ చేస్తుండగా

చెక్ పాయింట్ దగ్గర డ్యూటీ చేస్తుండగా

జార్ఖండ్ లో సబ్ఇన్స్పెక్టర్ ను వాహనంతో ఢీకొట్టి చంపేశారు దుండగులు. చెక్ పాయింట్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఎస్ఐని హత్య చేశారు. తుపుదానా పోలీస్ స్టేషన్ లో సంధ్యా టోప్పో పనిచేస్తున్నారు. రాత్రి చెక్ పాయింట్ దగ్గర ఎస్ ఐ సంధ్య డ్యూటీ చేస్తుండగా దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను పట్టించుకోకుండా నిందితులు వాహనాన్ని మందుకు పోనిచ్చారు.  తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సంధ్యను రిమ్స్ కు తరలించగా.. ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రాంచీ పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. వాహనంలో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది.