పెండింగ్ కేసులపై దృష్టిపెట్టాలి : సీపీ అనురాధ

పెండింగ్ కేసులపై దృష్టిపెట్టాలి : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: కేసులలో శిక్షల శాతం పెంచాలని, పెండింగ్ కేసులపై దృష్టిపెట్టాలని సీపీ అనురాధ సూచించారు. సోమవారం సీపీ ఆఫీస్ లో పోలీస్​అధికారులతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ కేసులలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ అవసరమని, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై మరింత నిఘా పెట్టాలన్నారు.

పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. చోరీకి గురైన 121 ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డిస్టిక్ కోర్టు పీపీ జీవన్ రెడ్డి, అడిషనల్ కోర్టు పీపీ ఆత్మా రాములు కేసుల ఇన్వెస్టిగేషన్​లలో చేస్తున్న పొరపాట్ల గురించి అధికారులకు వివరించారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన బాలమల్లయ్య, పవన్ కుమార్, సత్యనారాయణ, అబ్దుల్ బాసిత్ ను  అభినందించారు. సమావేశంలో డీసీపీలు,ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.