నటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూత

నటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూత

ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ(RS Shivaji)(66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులు అయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. 

ఇక హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ సినిమాల విషయానికి వస్తే.. ఆయన తమిళ, తెలుగు భాషల్లో చాల సినిమాల్లో నటించారు. ఇక చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. ఆ తరువాత కూడా.. వెయ్యి అబద్దాలు, సత్య, జీవ, కుట్టి, గార్గి వంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక చివరగా సూర్య హీరోగా వచ్చిన ఆకాశమే హద్దురా, కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలో కనిపించారు.