బయటి వారు రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకోవాలి

బయటి వారు రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకోవాలి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ కలిసి చర్యలు చేపట్టాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీ చేసిన సబితా ఇంద్రారెడ్డి… మున్సిపల్ ఆఫీస్ లో పలువురు అధికారులతో కరోనా పై సమీక్ష నిర్వహించారు. ప్రతీ డివిజన్ కాలనీ బస్తీల్లో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రోడ్లపై పై ఎవరు తిరగకుండా సరైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ఆ తర్వాత అల్మాస్గూడ లో రేషన్ షాపులో ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రతీ వ్యక్తికి బియ్యం ఇస్తామని ప్రతీ ఒక్కరూ మూడు అడుగుల దూరంగా క్యూలైన్లో రావాలి ఆమె చెప్పారు. బియ్యం సరఫరా మరో వారం పాటు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బాలాపూర్ తహశీల్దార్ కు సూచించారు.

కాలనీ లోకి వచ్చే బయటి వారిని రాకుండా స్థానిక ప్రజలు కంచెలు  ఏర్పాటు చేసుకోవాలన్నారు. అత్యవసరం ఉంటేనే ప్రజలు రోడ్లపైకి రావాలని… అది కూడా ఒక్కరే రావాలన్నారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.