పటాన్ చెరులో మత్తడిపోస్తున్న ఎనకచెరువు..చెరువును తలపిస్తున్న కాలనీలు

పటాన్ చెరులో మత్తడిపోస్తున్న ఎనకచెరువు..చెరువును తలపిస్తున్న కాలనీలు

గత రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరంలోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీ చుట్టు పక్కల గ్రామాల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. దీంతో సమీప గ్రామాలు, కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. ఇండ్లు, రోడ్లపై వరద నీరు నిల్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం పటాన్ చెరు మండలం ముత్తంగా గ్రామంలో ఎనకచెరువు అలుగుపోస్తుండటంతో నీరంతా సమీప కాలనీలను చుట్టుముట్టింది. వివరాల్లోకి వెళితే..    

ఇటీవల కురిసిన వర్షాలకు (సెప్టెంబర్ 19) పటాన్ చెరు (మం) ముత్తంగి గ్రామంలోని శుక్రవారం ఎనక చెరువు నిండడంతో పొంగిపొర్లుతోంది. దీంతో సమీపంలో ఉన్న చిట్కుల్,  నాగార్జున, రాధమ్మ కాలనీ ఇల్లలోకి నీళ్లు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. 

ALSO READ : వికారాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్..

ప్రతియేటా వర్షాలు వచ్చిన సమయంలో ఇదే రిపీట్ అవుతుందని గ్రామస్తులు, కాలనీవాసులు వాపోతున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాలను కబ్జాలకు గురికావడం దుకాణాలు ఏర్పాటు కావడంతో వరద నీటి సమస్య ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో అధికారులు వచ్చి హడావుడి చేస్తున్నారే తప్పా శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించిన వెంటనే వరదకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు స్థానికులు.