Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో ఆధిపత్య పోరు.. ఓనర్‌షిప్ కోసం కంటెస్టెంట్స్ మధ్య బిగ్ ఫైట్!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో ఆధిపత్య పోరు.. ఓనర్‌షిప్ కోసం కంటెస్టెంట్స్ మధ్య బిగ్ ఫైట్!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 హౌస్‌లో కంటెస్టెంట్లు ప్రతీ వారం ఏదో ఒక కొత్త గేమ్, కొత్త టాస్క్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ సరికొత్త అవకాశాన్ని ఇచ్చారు. అదే టెనెంట్లుగా ఉన్నవారికి ఓనర్లుగా మారే ఛాన్స్! రెండవ కెప్టెన్‌గా డిమాన్ పవన్ నిలిచిన తర్వాత, ఈసారి హౌస్‌లో అధికార పీఠం ఎవరి సొంతం అవుతుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ ఓనర్‌షిప్ కోసం బిగ్‌బాస్ ఒక ఆసక్తికరమైన గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో, ఇప్పుడు ఉన్న ఓనర్లు (ప్రియ, మనీష్) బొమ్మలు, బంతులు, ఇతర వస్తువులను విసిరేస్తారు. వాటిని టెనెంట్లు పట్టుకుని, తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాలి. గేమ్ ఎండ్ బజర్ మోగేసరికి ఎవరి బాస్కెట్‌లో ఎక్కువ వస్తువులు ఉంటే వారే గెలిచి, ఓనర్లుగా మారతారు.

గేమ్ మొదలైనప్పుడు అంతా ప్రశాంతంగానే ఉంది. ప్రియ, మనీష్ విసిరిన వస్తువులను టెనెంట్లు జాగ్రత్తగా పట్టుకున్నారు. కానీ ఆ తర్వాతే అసలు రచ్చ మొదలైంది. ఒక్కసారిగా ఈ గేమ్ రచ్చ రచ్చగా మారింది. టెనెంట్లు ఒకరి బాస్కెట్‌లో ఉన్న వస్తువులను మరొకరు దొంగిలించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో హౌస్‌మేట్స్ మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటుంది. సంజన, రీతూ మధ్య పెద్ద తోపులాట చోటు చేసుకుంటుంది.

ఒక దశలో ఫ్లోరా, ఇమ్మాన్యుయేల్ కలిసి రీతూను కిందపడేశారు. ఈ చర్యతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. మరోవైపు, సుమన్ శెట్టి తన దూకుడును ప్రదర్శించాడు. ఫ్లోరా తన దగ్గరకు వచ్చినప్పుడు సుమన్ ఆమెను మోచేతితో బలంగా నెట్టాడు. ఈ చర్యకు ప్రియ కఠినంగా స్పందించింది. ఎవరైనా శారీరకంగా దాడి చేస్తే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తాను అని గట్టిగా హెచ్చరించింది. కానీ సుమన్ ఆ మాటలను పట్టించుకోలేదు.

సుమన్ శెట్టికి, సంజనకి మధ్య జరిగిన వాగ్వాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. సంజన తన బాస్కెట్‌లోని వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించగా, సుమన్ ఆమె చేతిని బలంగా నెట్టేశాడు. ఈ ప్రవర్తనతో సహనం కోల్పోయిన ప్రియ, సుమన్‌ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసింది. ఈ నిర్ణయానికి కోపంతో ఊగిపోయిన సుమన్, తన బాస్కెట్‌ను బలంగా కాలితో తన్నేశాడు. అతని చర్యలు హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ గేమ్ కేవలం వస్తువులను సేకరించడం మాత్రమే కాదని, అది హౌస్‌మేట్స్ యొక్క నిజమైన స్వభావాన్ని బయటపెట్టిందని చెప్పొచ్చు. ఓనర్ల స్థానం కోసం వారు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారని నిరూపిస్తున్నట్లు ఉంది. మరి ఈ భీకర పోరు తర్వాత టెనెంట్లలో ఎవరు ఓనర్లయ్యారు? ఈ గేమ్ వల్ల హౌస్‌లో కొత్తగా ఏర్పడే గ్రూపులు ఏవి? సుమన్ శెట్టిపై బిగ్‌బాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇవన్నీ తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.