యాసంగిలో ఎరువుల సమస్యలు రానివ్వొద్దు

యాసంగిలో ఎరువుల సమస్యలు రానివ్వొద్దు
  • ఆఫీసర్లతో ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ పార్థసారథి సమీక్ష

యాసంగి సీజన్‌‌లో ఎరువుల వంపిణీలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ మొదలవుతున్నందున శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో  జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో వానలు బాగా పడినందున ఈ రబీలో సాగు విస్తీర్ణం18 లక్షల ఎకరాలకు పెరిగే సూచనలు ఉన్నాయని ఆయన చెప్పారు. రైతులు, గ్రామాల వారీగా సేకరించిన సమాచారాన్ని ఈ నెల 20లోపు పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్నారు. రబీ సాగు విస్తీర్ణానికి సంబంధించి మండలాలు, గ్రామాల వారీగా నివేదిక రూపొందించాలన్నారు. ఎరువుల పంపిణీలో కలెక్టర్లకు, డీఏవోలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, అన్ని జిల్లాల్లో బఫర్‌‌‌‌ స్టాక్ పెడుతున్నామని తెలిపారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.