‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ అభిమానులు ఆశించిన సినిమా ఆయన దగ్గర నుంచి రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ‘ఆదిపురుష్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. అది అందర్నీ ఆకట్టుకోలేకపోయింది. ఇక శుక్రవారం ‘సలార్’తో వచ్చి తనదైన యాక్షన్‌ను చూపిస్తూ ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం కల్పించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2898ఏడీ’తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్.
