ఏకగ్రీవం పేరుతో వేలం, ప్రలోభాలు కరెక్ట్ కాదు : ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ

ఏకగ్రీవం పేరుతో వేలం, ప్రలోభాలు కరెక్ట్ కాదు : ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ
  • పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరగాలి: ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరగాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ) పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని ఆరోపించింది. ఎన్నికల నిర్వహణపై ఏకగ్రీవాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. 

మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సమావేశంలో ఫోరం ప్రెసిడెంట్ ఎం.పద్మనాభరెడ్డి, రిటైర్డ్ ఐఎఎస్ చంద్రవదన్, కార్యదర్శి సోమ శ్రీనివాస్ రెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రవదన్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల ప్రమేయం లేకుండా జరగాలని, కానీ, రాజకీయ పార్టీలు పార్టీలపరంగా జరిగే ఎన్నికలుగా వీటిని మార్చేశారన్నారు. 

ఓటర్లు స్వచ్ఛందంగా మంచి వారిని ఎన్నుకోవాలి కానీ, ఏకగ్రీవం పేరుతో వేలం, ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. బలవంతపు ఏకగ్రీవాలు ఆపేందుకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ బాగున్నా.. అది ఎన్నికల అక్రమాలను ఆపలేదన్నారు. మూడు విడతల ఎన్నికల కౌటింగ్ 17వ తేదీనే జరిపి ఫలితాలు విడుదల చేయాలని కోరారు.