కుట్టు మిషన్ల పంపిణీ  స్కీమ్ను.. పకడ్బందీగాఅమలు చేయండి..సీఎంకు ఎఫ్జీజీ లేఖ

కుట్టు మిషన్ల పంపిణీ  స్కీమ్ను.. పకడ్బందీగాఅమలు చేయండి..సీఎంకు ఎఫ్జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు: బీసీ మహిళలకు ఉచి తంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించి, మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధిని కల్పిస్తామని  ప్రభుత్వం జీవో విడుదల చేయడం హర్షణీయమన్నారు. కుట్టు మిషన్ల పంపిణీ  స్కీమ్​ను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ మంగళవారం సీఎం రేవంత్​ రెడ్డికి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు.

ఈ పథకంపై త్వరగా మార్గదర్శకాలు  విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వం దళిత బంధు పథకం తెచ్చి వేలాది కుటుంబాలకు రూ.10 లక్షల సాయం అందించ గా, చాలామంది వ్యాపారాలు ప్రారంభించలేకపోయారని.. అలాగే, వాసలమర్రి గ్రామంలో దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందించగా.. కొందరు కార్లు, ట్రాక్టర్లు కొన్నారని, మరికొందరు అనుభవం లేకున్నా పౌల్ట్రీలు, డెయిరీలు ప్రారంభించారని చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో సరైన శిక్షణ లేకపోవడంతో లబ్ధిదారులు కొనుగోలు చేసిన ఆస్తులను సమర్థంగా వినియోగించలేకపోయారని గుర్తించినట్లు వివరించారు.