
హైదరాబాద్, వెలుగు: మనీ మేనేజ్మెంట్ప్లాట్ఫాం ‘ఫై మనీ’ దేశంలో తొలిసారిగా ఎంసీపీ సర్వర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల యూజర్లు తమ మొత్తం ఆర్థిక వ్యవహారాలను ఏఐ అసిస్టెంట్లతో చెక్ చేసుకోవచ్చు. మన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకోవచ్చు.
కన్స్యూమర్- ఫేసింగ్ పర్సనల్ ఫైనాన్స్ ఇంప్లిమెంటేషన్ అయిన మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ (ఎంసీపీ) యాప్ బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లు, లోన్లు, బీమా, ఈపీఎఫ్, రియల్ ఎస్టేట్, బంగారం వంటి అన్నిరకాల ఆర్థిక వ్యవహారాలను ఒకేచోట యూజర్‌కు చూపిస్తుంది. కావల్సిన వివరాలను చాట్‌జీపీటీ, జెమిని లాంటి ఏఐ అసిస్టెంట్లతో చూసుకోవచ్చు.
ప్రస్తుతం యూజర్లు పలు రకాల ఫైనాన్స్ యాప్‌లు, స్టేట్‌మెంట్లు, స్ప్రెడ్ షీట్లు ఉపయోగించి.. తమ ఆర్థిక వ్యవహారాలపై చాట్ జీపీటీ, జెమిని లాంటి ఏఐ టూల్స్ సాయంతో సలహాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మాన్యువల్‌గా ఇన్‌పుట్లు ఇవ్వాలి. ఫై మనీ ఎంసీపీ సర్వర్ ఆర్థిక సమాచారాన్ని ఏఐ ప్రోగ్రామ్‌లకు అర్థమయ్యేలా పంపిస్తుంది. ఫలితంగా అవి కస్టమర్లకు కచ్చితమైన సలహాలు ఇస్తాయి.