ఫిడే చెస్ వరల్డ్ కప్‌.. రెండో రౌండ్‌‌కు నారాయణన్

 ఫిడే చెస్ వరల్డ్ కప్‌.. రెండో రౌండ్‌‌కు నారాయణన్

పనాజి: ఫిడే చెస్ వరల్డ్ కప్‌‌లో ఇండియా ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. సోమవారం జరిగిన తొలి రౌండ్ టై బ్రేక్స్‌‌లో గెలిచిన  గ్రాండ్‌‌మాస్టర్ ఎస్.ఎల్. నారాయణన్,  దీప్తాయన్ ఘోష్ రెండో రౌండ్‌‌లోకి దూసుకెళ్లారు.  

ఇంటర్నేషనల్ మాస్టర్ అరోణ్యక్ ఘోష్  .. పోలాండ్ జీఎం మాటియస్ బార్టెల్‌‌ను ఓడించి ముందంజ వేశాడు.  టై బ్రేక్స్‌‌కు ముందే సూర్య శేఖర్ గంగూలీ, ప్రణవ్ వి, రౌనక్ సాధ్వాని, ప్రణేష్ ఎం, కార్తీక్ వెంకట్రామన్, ఇనియన్ పా రెండో రౌండ్‌‌  చేరుకున్నారు.