సస్పెన్షన్ తొలగించినట్టు ఫిఫా ప్రకటన

సస్పెన్షన్ తొలగించినట్టు ఫిఫా ప్రకటన
  • ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌పై బ్యాన్‌‌‌‌‌‌‌‌ తొలగింపు
  • ఇండియాలోనే విమెన్స్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌‑17 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌

జ్యూరిచ్‌‌‌‌‌‌‌‌: ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లు, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌న్యూస్‌‌‌‌‌‌‌‌. ఆలిండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ (ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌)పై బ్యాన్‌‌‌‌‌‌‌‌ తొలగింది. నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణకు వేసిన  కమిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌‌‌‌‌‌‌ (సీవోఏ)ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో సస్పెన్షన్ తొలగించినట్టు ఫిఫా శుక్రవారం ప్రకటించింది. దాంతో, అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో విమెన్స్ అండర్‌‌‌‌‌‌‌‌–17 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ ఇండియాలోనే జరగనుంది. బయటి వ్యక్తుల జోక్యం కారణంగా ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌పై ఫిఫా ఈ నెల 15వ తేదీ నిషేధం విధించింది. 

కానీ, 11 రోజుల్లోనే దాన్ని వెనక్కి తీసుకుంది. ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ రోజువారీ బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరిగి పొందిందని ధృవీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.  ఫలితంగా ఫిఫా అండర్‌‌‌‌‌‌‌‌17 విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ అక్టోబర్ 11–30 తేదీల్లో ఇండియాలోనే జరుగుతుందని తన ప్రకటనలో పేర్కొంది. ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు సకాలంలో పూర్తయ్యేందుకు ఫిఫా, ఏఎఫ్‌‌‌‌‌‌‌‌సీ పరిస్థితిని సమీక్షిస్తుందని తెలిపింది.