పల్నాడులో ఉద్రిక్తత.. వైసీపీ,టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..

పల్నాడులో ఉద్రిక్తత.. వైసీపీ,టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..

2024 సార్వత్రిక  ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో 5రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం సిరిగెపాడులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి రమా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో పిన్నెల్లి భార్య రమాకు గాయాలయ్యాయి. దాడిని ఆపబోయిన ఎస్సై శ్రీహరి తలకు గాయం అయ్యింది. ఈ దాడిలో రమాతో పాటు ప్రచారంలో పాల్గొన్న పలువురు మహిళలకు కూడా గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ టీడీపీ శ్రేణులు ప్రచార వాహనాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో జరిగిన ఈ దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.