నాపై తప్పుడు కేసును కొట్టేయండి.. హైకోర్టులో దుద్దిళ్ల శ్రీధర్‌‌ బాబు పిటిషన్‌‌

నాపై తప్పుడు కేసును కొట్టేయండి.. హైకోర్టులో దుద్దిళ్ల శ్రీధర్‌‌ బాబు పిటిషన్‌‌

హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామ గుండం కమిషనరేట్‌‌ పరిధిలోని మంథని పీఎస్​లో గత నెల 20న నమోదైన పోలీసు కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌‌ పార్టీ నేత దుద్దిళ్ల శ్రీధర్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ​నేత పుట్టా మధుకర్‌‌పై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ స్థానిక నేత ఆర్‌‌ రఘుప్రసాద్‌‌ ఎన్నికల రిటర్నింగ్‌‌ అధికారికి తనపై ఫిర్యాదు చేశారని, మంథని పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు.

తాను పుట్టా మధుకర్‌‌ను అనుచిత పదజాలంతో విమర్శలు చేయలేదని, గతంలో వైరల్​అయిన ఆ వీడియో కల్పితమని, ఆ కేసును కొట్టేయాలని శ్రీధర్‌‌బాబు తన పిటిషన్​లో హైకోర్టును కోరారు. ఆ కల్పిత వీడియోకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మధుకర్‌‌కు బదులు రఘుప్రసాద్‌‌ ఫిర్యాదు చేయడం కూడా చెల్లదన్నారు. మంథని పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న పిటిషన్‌‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.