నేచర్ క్యూర్ ఆసుపత్రిని సందర్శించిన సోనుసూద్

నేచర్ క్యూర్ ఆసుపత్రిని సందర్శించిన సోనుసూద్

హైదరాబాద్ : రెనోవేషన్ జరుగుతున్న  నేచర్ క్యూర్ ఆసుపత్రిని సినీ నటుడు సోనుసూద్ సందర్శించారు. కొత్తగా పునరుద్ధరణ పనులు జరుగుతున్న  కాటేజీలు, భోజనశాల, యోగ ప్రాంగణాన్ని పరిశీలించారు. రోగులకు వైద్యులు అందిస్తున్న  ట్రీట్ మెంట్, వారి డైట్ గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్యాంపస్ గేట్ ముందు సోనుసూద్, అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ సంపంగి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, నేచర్ క్యూర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.