క్యాన్సర్ కంటే.. నెగిటివిటే డేంజర్ : సినీ నటి ఐశ్వర్య రాజేశ్

క్యాన్సర్ కంటే.. నెగిటివిటే డేంజర్ : సినీ నటి ఐశ్వర్య రాజేశ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యాన్సర్ కంటే నెగిటివిటీతో నిండిన ప్రపంచంలో జీవించడం చాలా కష్టమని సినీ నటి ఐశ్వర్య రాజేశ్, కమెడియన్​ అలీ అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న గచ్చిబౌలి స్టేడియంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన రన్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన టీషర్ట్​, మెడల్​ను శుక్రవారం హోటల్ దసపల్లాలో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చినబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. 2కే, 5కే, 10కే విభాగాల్లో రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 130 దేశాల్లో తమ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నరేంద్రనాథ్, ప్రశాంతి, రమేశ్, ఖాజా పాల్గొన్నారు.