తమిళ్ కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్న కుష్బూ

తమిళ్ కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్న కుష్బూ

నేరేడ్ మెట్ లోని జీకే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తమిళ్  కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కుష్బూతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర సహాయ మంత్రి మురుగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ పథకాలను అక్కడి ప్రజలకు వివరించారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి, మౌలాలి బీజేపీ కార్పొరేటర్లు, మల్కాజిగిరి తమిళ ప్రజలు పాల్గొన్నారు.