తుది దశకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు.. సీక్రెట్ ఓటింగ్ లేదా టాస్కు సి.కళ్యాణ్ ప్యానల్ డిమాండ్

తుది దశకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు.. సీక్రెట్ ఓటింగ్ లేదా టాస్కు సి.కళ్యాణ్ ప్యానల్ డిమాండ్

హైదరాబాద్ : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ఛాంబర్ ప్యానెల్ లో అధ్యక్ష పదవికి మొత్తం ఓట్లు 48. మెజార్టీ మార్క్ 25. 

* ఈ ఎన్నికల్లో మొత్తం 1339 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో 891, డిస్ట్రీబ్యూషన్ సెక్టార్‌లో 380, స్టూడియో సెక్టార్‌లో 68 ఓట్లు నమోదయ్యాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో దిల్ రాజు ప్యానెల్‌కు 563, సి.కళ్యాణ్ ప్యానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి.

* ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ లో  మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో దిల్ రాజుకు 10, సి. కళ్యాణ్ కు 10 మంది ఉన్నారు.

* ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో దిల్ రాజ్ ప్యానల్ నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. సి. కల్యాణ్ కు ఐదుగురు ఎంపికయ్యారు. దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, పద్మిని, స్రవంతి రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్ విజేతలుగా నిలిచారు.

* స్డూడియో సెక్టార్ లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ సభ్యులు ఉన్నారు. 

* డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో ఇరు ప్యానల్స్ తరపున అటు ఆరుగురు ఇటు ఆరుగురు గెలుపొందారు. 

* ఇప్పటికే 44 మందిలో 16 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జులై 30వ తేదీ ఆదివారం రోజు 28 మంది సభ్యులకు పోలింగ్ నిర్వహించారు. 

* ప్రొడ్యూసర్ సెక్టార్ లో దిల్ రాజు(563) గెలుపొందారు. నాలుగు సెక్టార్లు కలిపి ప్రెసిడెంట్ ను ఎన్నుకోనున్నారు. ఈసారి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ఎన్నిక కానున్నారు. 

* సీక్రెట్ ఓటింగ్ లేదా టాస్  కు సి.కళ్యాణ్ ఫ్యానల్ పట్టుబడుతోంది. సి.కళ్యాణ్ ప్రతిపాదనకు దిల్ రాజు ఒప్పుకోలేదు. అంగీకారంతో 20 మంది ఒకే సైడ్ కు రావాలని దిల్ రాజు కోరుతున్నారు. 

* టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఉంటాయి. దాదాపు మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు.

* టీఎఫ్‌సీసీ అధ్యక్ష బరిలో నిర్మాతలు సి. కల్యాణ్, దిల్ రాజు నిలిచారు. దీంతో హోరాహోరీగా ఓటింగ్ ప్రక్రియ సాగింది. ఈ ఎన్నికలు సాధారణ ఎలక్షన్లను తలపించాయి. ఈ ఎన్నికలు ప్రతి రెండేళ్లకోసారి జరుగుతాయి. గెలిచిన వ్యక్తి టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారు.