గదిలో షార్ట్ సర్క్యూట్.. మంటలు అంటుకొని..సినీ కొరియోగ్రాఫర్ ​మృతి

గదిలో షార్ట్ సర్క్యూట్.. మంటలు అంటుకొని..సినీ కొరియోగ్రాఫర్ ​మృతి

గండిపేట, వెలుగు: అగ్ని ప్రమాదంలో ఓ సినీ కొరియోగ్రాఫర్‌‌ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొరియోగ్రాఫర్​పోరేటి వీరేందర్‌‌రెడ్డి(38) పుప్పాలగూడ శ్రీనగర్‌‌ కాలనీ కుతుబ్‌‌ ఆర్కెడ్‌‌ అపార్ట్‌‌మెంట్‌‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆయన తల్లిదండ్రులు ప్రకాశ్​రెడ్డి, విజయ, పిల్లలు మౌతిక, నిషాంత్‌‌రెడ్డి ఒక గదిలో పడుకున్నారు.

మరో గదిలో వీరందర్‌‌రెడ్డి నిద్రించారు. అర్ధరాత్రి ఆయన గదిలో షార్ట్‌‌సర్క్యూట్‌‌ జరిగి, మంటలు చెలరేగాయి. కుటుంబసభ్యులు  పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్​సిబ్బంది వచ్చి, మంటలు ఆర్పివేశారు. వీరేందర్‌‌రెడ్డిని ఆస్పత్రికి తరలించగా మంటలు అంటుకోవడం వల్ల మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.