భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ -2026, జనవరి 06.
మొత్తం పోస్టుల ఖాళీలు: 06.
ఖాళీల వివరాలు: ట్రైనీ ఇంజినీర్–I (మెకానికల్) 04, ప్రాజెక్ట్ ఇంజినీర్–I (మెకానికల్) 01, ప్రాజెక్ట్ ఇంజినీర్–I (ఎలక్ట్రికల్) 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) బీఈ/ బి.టెక్./ బీఎస్సీ ఇంజినీరింగ్‌లో నాలుడేండ్ల డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా నిర్దిష్ట పోస్ట్- క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 32 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 23.
అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్ –I పోస్టులకు రూ.150. ప్రాజెక్ట్ ఇంజినీర్–I పోస్టులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
లాస్ట్ డేట్: 2026 జనవరి 16.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ట్రైనీ ఇంజినీర్: 2026 జనవరి 16.
ప్రాజెక్ట్ ఇంజినీర్: 2026 జనవరి 20.
సెలెక్షన్ ప్రాసెస్
ట్రైనీ ఇంజినీర్ -I : రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజినీర్-I: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.bel-india.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
