సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతి

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతి

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. రాజేందర్ హైదరాబాద్‌‌లోని మియాపూర్–2 డిపోలో కండక్టర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆకస్మిక మరణంపై ఆర్టీసీ కార్మికులు, ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజేందర్ మృతి వార్త తెలిసిన వెంటనే ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న సహా పలువురు యూనియన్ నేతలు ఆయనకు నివాళులర్పించారు. రాజేందర్ మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, చంద్రబోస్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.