అన్నపూర్ణ స్టూడియో ముందు సినీ కార్మికుల ధర్నా

అన్నపూర్ణ స్టూడియో ముందు సినీ కార్మికుల ధర్నా
  • వేతనాలు 30%  పెంచాలని డిమాండ్

జూబ్లీహిల్స్, వెలుగు:  తమ వేతనాలు పెంచాలంటూ 15 రోజులుగా 24 విభాగాల్లో పనిచేసే వేలాది మంది సినీ కార్మికులు షూటింగ్స్​ బంద్​చేసి ఆందోళనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నటుడు​చిరంజీవితో నిర్మాతలు, ఫెడరేషన్​పెద్దలు కార్మికుల డిమాండ్లపై జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు.

 మంగళవారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్​ఫెడరేషన్​24 అనుబంధ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో  వేలాది మంది సినీ కార్మికులు అన్నపూర్ణ స్టూడియో దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఫెడరేషన్​ పెద్దలు మాట్లాడుతూ.. కార్మికులకు 30% వేతనాలు పెంచే వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

 నిర్మాత నట్టికుమార్​మాట్లాడుతూ.. అంతో ఇంతో చిన్ని సినిమా నిర్మాతలే  రోజువారీ వేతనాలను సినీ కార్మికులకు అందజేస్తున్నారన్నారు. పెద్ద సినిమా నిర్మాతలు ఇప్పటి వరకు సినీ కార్మికులకు సుమారుగా 13 కోట్ల 54 లక్షల వేతనాలు ఆపేశారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు ఎలా సినిమా పరిశ్రమలో పనిచేస్తారని ఆయన నిలదీశారు.