WPL Final 2024: ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య టైటిల్ పోరు

WPL Final 2024: ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య టైటిల్ పోరు

WPL 2024: వుమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టైటిల్ పోరు ఆదివారం రాత్రి 7.30 కి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది.రెండు జట్లు టైటిల్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. అయితే ఆర్సీబీ ఫైనల్ కు చేరడం ఇదే తొలి సారి కాగా.. ఢిల్లీ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 

ట్రోఫిని ఎవరు గెలుస్తారో తేల్చే  ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి17) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఇందులోఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయాల్ ఛాలెంజర్స్ జట్లు పోటి పడనున్నాయి. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 8 గేమ్ లలో 6 మ్యాచుల్లో విజయం సాధించి 12 పాయింట్లతో లీగ్ లో అగ్రస్థానంలో ఉంది. వరుసగా 2వ సారి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. 

స్మృతి మంధాన నేతృత్వంలోని బెంగళూరు జట్టలు 8 పాయింట్లతో 3 స్థానంలో నిలిచింది. లీగ్ రౌండ్ లో నిలకలేని ఆటతీరుతో ఆ జట్టు ఎలిమినేషన్ రౌండ్ లో 5 పరుగులు తేడాతో ముంబై ని ఓడించి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 

ఈ సీజన్ లో బెంగళూరులో జరిగిన లీగ్ గేమ్ లను వరుసగా 25 పరుగులు, ఒక పరుగుతో తేడాతో గెలుపొందిన ఢిల్లీ జట్టు గతేడాది ఫైనల్ లో ముంబై తో ఫైనల్ లో ఓడిపోయింది. ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలని చూస్తోంది. అదే సమయంలో ఢిల్లీతో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ లలో ఓట మికి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు జట్టు భావిస్తోంది. 

ఇదిలా వుంటే ఐపీఎల్ గత 16 ఏళ్లలో రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒక్కసారి కూడా ట్రోఫిని గెలవలేదు. కానీ మహిళా ప్రీమియర్ లీగ్ లో ఇరు జట్లు టైటిల్ పోరుకు సిద్దమవుతున్నాయి. ట్రోఫిని కౌవసం చేసుకునేందుకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.